AP News: విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం: మంత్రి సురేశ్‌

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యాంశాలను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సంక్రాంతి సెలవుల అనంతరం

Updated : 17 Jan 2022 16:50 IST

అమరావతి: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యాంశాలను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మొదలయ్యాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని మంత్రి సురేశ్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించేలా ఇప్పుడు పాఠ్యాంశాల బోధన జరుగుతోందన్నారు. కొవిడ్‌ కారణంగా గడిచిన రెండేళ్లలో ఆల్‌ పాస్‌ అనే విధానం పాటించామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఎదరయ్యే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు మూసివేయరాదన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. 15 ఏళ్లు దాటిన 26లక్షల మంది విద్యార్థుల్లో ఇప్పటికే 90శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తయిందన్నారు.

ఉపాధ్యాయులకు కొవిడ్‌ వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 150 రోజుల పాటు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని, ఇక ముందూ నడుస్తాయన్నారు. కొవిడ్‌  వ్యాప్తికి, పాఠశాలలు నడపటానికి సంబంధం లేదని మంత్రి సురేశ్‌ వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఆన్‌లైన్‌ విద్యాబోధనకు ఓ పరిమితి ఉందని, ప్రాథమిక, మాధ్యమిక విద్యకు అది ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్యార్థులు క్యారియర్లు అయినప్పటికీ వారికి వ్యాక్సిన్‌ వేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 30శాతం సిలబస్‌ పూర్తి చేశామన్నారు. ఫిబ్రవరి తర్వాత 15 ఏళ్లలోపు వారికీ వ్యాక్సిన్‌ వేస్తామని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని