Andhra News: విజయవాడ ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్‌

రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated : 15 May 2022 05:58 IST

విజయవాడ: రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం  విజయవాడ ధర్నా చౌక్‌ నుంచి చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ధర్నాచౌక్‌ వద్దకు చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

153 మందిని పరీక్షలకు అనుమతించకుండా వీసీ ఆనందరావు వారి జీవితాలను నాశనం చేశారని విద్యార్థి, యువజన సంఘ నాయకులు ఆరోపించారు. అనంతరం విద్యార్థి, యువజన సంఘాల నేతలు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు రాజ్‌భవన్‌, ధర్నాచౌక్‌లో సీపీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని