Andhra News: వైకాపాను మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాం: బొత్స

వైకాపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే అందరి బాధ్యతగా పనిచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 07 Apr 2022 20:19 IST

అమరావతి: వైకాపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే అందరి బాధ్యతగా పనిచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్‌ ఆధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం మారుస్తారని సీఎం జగన్ ముందే చెప్పారన్నారు. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంత్రివర్గంలో ఎవరిని కొనసాగించాలనే విషయాన్ని సీఎం నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తామని సీఎంకు చెప్పినట్లు బొత్స వివరించారు. ‘‘ఎవరికి ఎలాంటి బాధ్యత అప్పగించాలి అనేది అధ్యక్షుడి ఉన్న స్వేచ్ఛ. ఎవరిని కొనసాగించాలనేది ఆయన ఇష్టం. మంత్రిగా ఉన్నప్పటికీ పార్టీ పరంగా కూడా ఎలక్షన్‌ టీమ్‌గా పనిచేయాలి. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై సీఎం ప్రణాళిక ఇస్తారు. పాత కేబినెట్‌ మాదిరిగా కొత్త మంత్రి వర్గంలో సామాజిక సమీకరణలు ఉంటాయి’’ అని బొత్స పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని