Andhra News: నా కారునే ఆపుతావా?.. కానిస్టేబుల్‌పై డ్రైవర్ దాడి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్‌ దాడికి దిగారు.

Updated : 03 May 2022 15:40 IST

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్‌ దాడికి దిగారు. అత్యంత వేగంతో వెళ్తున్న కారును నియంత్రించేందుకు కానిస్టేబుల్‌ యత్నించడంతో ఆగ్రహించిన కారు డ్రైవర్‌ సంతోష్‌ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం ప్రదర్శించాడు. పిడి గుద్దులు గుద్దుతూ దాడి చేశాడు. కారు డ్రైవర్‌ది భీమవరంలోని గునిపూడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన భీమవరం ఒకటో పట్టణ పోలీసులు డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్‌ దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు