Crime News: బంగారు ఆభరణాల దుకాణంలో మహిళల చేతివాటం.. సీసీ ఫుటేజీతో గుర్తింపు!

ప్రకాశం జిల్లా అద్దంకి రామాటాకీస్ వీధిలో ఓ బంగారు ఆభరణాల దుకాణంలో కొందరు మహిళలు చేతివాటం ప్రదర్శించారు.

Published : 30 Jan 2022 13:58 IST

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి రామాటాకీస్ వీధిలో ఓ బంగారు ఆభరణాల దుకాణంలో కొందరు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. నగల దుకాణానికి వెళ్లిన ముగ్గురు మహిళలు.. చెవి కమ్మలు కావాలని షాపు యజమానిని అడిగారు. ఆయన చూపించిన కమ్మలు పరిశీలిస్తూనే ఓ మహిళ ఇంకో వస్తువు కావాలని అడిగింది. ఇంతలో మిగిలిన ఇద్దరు మహిళలు.. పెద్ద సైజు కమ్మల జత మార్చి వారి వద్ద ఉన్న మరో చిన్న జతను అందులో అమర్చారు. వీటి మధ్య వ్యత్యాసం రెండు సవర్లు ఉంటుంది. అనంతరం ఓ చిన్నపాటి వస్తువును కొనుగోలు చేసి రసీదు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఏదో మోసం జరిగినట్లు అనుమానించిన దుకాణ యజమాని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా.. మహిళలు చేతివాటం ప్రదర్శించినట్లు గుర్తించారు. అనంతరం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని