Andhra News: సింహాచలంలో ఘనంగా చందనోత్సవం.. తరలివచ్చిన భక్తులు

విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది.

Updated : 03 May 2022 15:21 IST

సింహాచలం: విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి పోటెత్తారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు దర్శనం చేసుకుని తొలి చందన సమర్పణ చేశారు. అనంతరం పలువురు ప్రముఖులు అప్పన్నస్వామిని దర్శించుకున్నారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పీవీఎన్‌ మాధవ్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారిని నిజరూపాన్ని దర్శించుకున్నారు. చందనోత్సవ పర్వదినం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో సింహగిరిపై సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయశాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని