Andhra News: తప్పుడు నిర్ణయాలతో పోలవరం నిర్మాణంలో జాప్యం: షెకావత్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెదేపా అదినేత చంద్రబాబు మండిపడ్డారు.

Published : 30 Jun 2022 01:35 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెదేపా అదినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు చంద్రబాబు లేఖ రాశారు. వైకాపా ఏకపక్ష నిర్ణయాలతోనే ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం సత్వర పూర్తికి సహకరించాలని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులను మరో ఏజెన్సీకి అప్పగించారని విమర్శించారు. ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులను ప్రారంభించేందుకు 6 నెలల సమయం పట్టిందన్నారు. పనులు చేపట్టక పోవడంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని లేఖలో చంద్రబాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని