AP News: చింతామణి నాటకంపై నిషేధం విధించిన ప్రభుత్వం

గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియని వారు ఉండరు. పల్లెల్లో అంతగా ప్రాచుర్యం పొందింది ఈ డ్రామా. అయితే, చింతామణి నాటకంపై నిషేధం విధించాలని అర్యవైశ్యులు కోరారు.

Published : 18 Jan 2022 01:45 IST

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియని వారు ఉండరు. పల్లెల్లో అంతగా ప్రాచుర్యం పొందింది ఈ డ్రామా. అయితే, చింతామణి నాటకంపై ఇటీవలి కాలంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. సమాజాన్ని ప్రభావితం చేయటంలో అనాదిగా నాటకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా చింతామణి నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే బదులు వ్యసనాల వైపు మళ్లిస్తుందని, ఈ నాటకాన్ని వెంటనే నిషేధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నాటకంలోని సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని, నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని