CM Jagan: అగ్నిప్రమాద ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి.. రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటన

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని

Updated : 14 Apr 2022 09:31 IST

అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

బుధవారం అర్ధరాత్రి సమయంలో రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఐదుగురు సజీవదహనం కాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. 13 మంది తీవ్రంగా గాయపడగా వారిని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని