AP News: ఆరుగురు వస్తామని.. వందలాది మంది వచ్చారు: డీఐజీ మోహన్‌రావు

కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం, ఉద్రిక్త పరిస్థితులపై డీఐజీ మోహన్‌రావు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Updated : 24 Nov 2022 12:38 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం, ఉద్రిక్త పరిస్థితులపై డీఐజీ మోహన్‌రావు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గుడివాడలో ఉద్రిక్త వాతావరణం సృష్టించడం వల్లే తెదేపా నేతలను అరెస్టు చేసినట్టు చెప్పారు. ‘‘నిజనిర్ధరణ కమిటీ నుంచి ఆరుగురు తెదేపా నేతలే వస్తామని చెప్పి వందలాది మంది వచ్చారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందా అనేదాన్ని కూడా పరిశీలిస్తున్నాం. గృహనిర్బంధం, అరెస్టు చేయాలని తెదేపా నేతలు ఎందుకు కోరారు. ఎక్కువ మంది వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడి ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతోనే వచ్చినట్టు భావిస్తున్నాం. రాజకీయాల కోసం శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని కోరుతున్నాం. గుడివాడలో కావాలని మేం ఎవరినీ అడ్డుకోలేదు. శాంతిభద్రతల్లో భాగంగానే కొందరిని నియంత్రించాం. రెచ్చగొట్టేలా మాట్లాడటం, కేకలు వేయడం తప్పు. ఏం జరిగింది, ఎవరు రెచ్చగొట్టారనేది దర్యాప్తు చేస్తున్నాం. గుడివాడ ఘటనపై ఎస్పీ నేతృత్వంలో వేసిన కమిటీ విచారణ జరుపుతోంది’’ అని డీఐజీ మోహన్‌ రావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని