
Updated : 26 May 2021 18:32 IST
Krishanpatnam: ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి
అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్) తొలి దశ అధ్యయనం పూర్తయింది. సీసీఆర్‌ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం చేశాయి.
ఆయా సంస్థల ఆయుర్వేద వైద్యులు రెస్ట్రోపెక్టివ్ స్టడీని పూర్తిచేశారు. ఆనందయ్య మందు తీసుకున్న 570 మందితో వారు మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీసీఆర్‌ఏఎస్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. రోగుల ఫీడ్ బ్యాక్ వివరాలపై ఆయుర్వేద వైద్యుల స్పందించలేదు. రేపటిలోపు సీసీఆర్‌ఏఎస్ తదుపరి ఆదేశాలు ఇస్తుందని అధికారులు తెలిపారు. సీసీఆర్‌ఏఎస్ అనుమతితో తర్వాత దశలో టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి
Tags :