AP News: వినుకొండ వైకాపా ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని: రైతు నరేంద్ర

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు అధికార పార్టీకి చెందిన రైతు గడిపూడి నరేంద్ర. ఎమ్మెల్యే పీఏపై

Published : 18 Jan 2022 20:48 IST

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు అధికార పార్టీకి చెందిన రైతు గడిపూడి నరేంద్ర. ఎమ్మెల్యే పీఏపై హత్యాయత్నం చేశారనే కేసులో అరెస్టయిన నరేంద్ర ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీరుపై ఆక్రోషం వెళ్లగక్కారు. ధాన్యానికి గిట్టుబాటు ధర రావటం లేదని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు దృష్టికి తీసుకురావటమే తాను చేసిన పాపమని... ఎమ్మెల్యే  ఆగ్రహానికి గురికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పీఏ ఆంజనేయులుని తాను ఇప్పటి వరకు చూడలేదని స్పష్టం చేశారు. 

‘‘ఈనెల 6న శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి వచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయులుకు ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పా. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహంతో చెప్పు తీసుకుని కొట్టడానికి వచ్చారు. వైఎస్‌ హయాంలో నేను కాంగ్రెస్‌లో ఉన్నా.. ఆ తర్వాత వైకాపాలో చేరా. నా సోదరులు తెదేపాలో ఉన్నా... నేను మాత్రం వైకాపాలో కొనసాగుతున్నా. నాకు తెదేపాతో సంబంధాలున్నాయనడం అసత్య ప్రచారం. బొల్లా బ్రహ్మనాయుడు గెలుపు కోసం పనిచేశా. ఎమ్మెల్యే పీఏ ఆంజనేయులును నేను ఇప్పటి వరకు చూడలేదు. అలాంటప్పుడు ఆయనపై హత్యాయత్నం ఎలా చేస్తాను? ఆనాటి ఘటనకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు సాక్ష్యం’’ అని రైతు నరేంద్ర మీడియాకు వివరించారు. ఆరోజు జరిగిన పరిణామాలపై ఏ ఆలయంలోనైనా తాను ప్రమాణానికి సిద్ధమని, ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారా అని సవాల్‌ విసిరారు. జైలు నుంచి బయటకు వచ్చిన నరేంద్రకు రైతు సంఘాల నేతలు స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని