కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల సాయం

కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.50 వేల చొప్పున సాయం అందించనుంది.

Updated : 26 Oct 2021 05:27 IST

ఈనాడు, అమరావతి: కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.50 వేల చొప్పున సాయం అందించనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి వీటి మంజూరు కలెక్టర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో ఓ సెల్‌ ఏర్పాటు చేసి, కొవిడ్‌ మృతుల కుటుంబీకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించి కలెక్టర్‌కు సిఫార్సు చేశాక, రెండు వారాల్లో సాయం అందించనున్నారు. దరఖాస్తులో స్థానిక ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, వైద్యాధికారి సంతకాలు కూడా అవసరమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని