ఆరోగ్య శాఖ ఉన్నతాధికారికి వింత అనుభవం!

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారికి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి వింత అనుభవం ఎదురైంది.

Updated : 06 Nov 2021 05:12 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారికి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి వింత అనుభవం ఎదురైంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఆయన రెండు డోసులు వేయించుకున్నారు. విజయవాడలో ఉన్న ఆ అధికారికి ఫిబ్రవరి 18న తొలి డోసు, అక్టోబరు 30న రెండో డోసు వేసినట్లు.. వ్యాక్సిన్‌ బ్యాచ్‌ నంబరుతో సహా వివరాలు కొవిన్‌యాప్‌లో తాజాగా నమోదుకావడం గమనార్హం. ఈ సంక్షిప్త సమాచారం సెల్‌ఫోన్‌కు రావడంతో ఆయన అవాక్కయ్యారు. జిల్లాల అధికారులతో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై చర్చ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని