తనయుడి పింఛను కోసం చెట్టెక్కి ఆందోళన

మానసిక వికలాంగుడైన తన కుమారుడికి పింఛను ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన తండ్రి చెట్టెక్కి ఆందోళన చేసిన సంఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో శనివారం

Updated : 17 Jan 2022 05:19 IST

చాగలమర్రి, న్యూస్‌టుడే: మానసిక వికలాంగుడైన తన కుమారుడికి పింఛను ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన తండ్రి చెట్టెక్కి ఆందోళన చేసిన సంఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో శనివారం జరిగింది. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండు వద్ద నివసిస్తున్న అమీర్‌బాషాకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సద్దాం మానసిక వికలాంగుడు కావడంతో పింఛను కోసం దరఖాస్తు చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో తండ్రి అమీర్‌బాషా శనివారం ఇంటి వద్దనున్న వందడుగుల వేపచెట్టు ఎక్కారు. విషయం తెలుసుకున్న ఎస్సై మారుతి సంఘటన స్థలానికి చేరుకుని చెట్టు ఎక్కి అమీర్‌బాషాకు నచ్చజెప్పి కిందికి దింపారు. సమస్యను ఎంపీడీవో షంషాద్‌బాను దృష్టికి తీసుకెళ్లగా.. బాధితుడి ఆధార్‌, ఇతర వివరాలతో సదరం సర్టిఫికెట్‌ ఉంటే వెంటనే పింఛను వచ్చేలా చూస్తామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని