logo

తిరుగు ప్రయాణ రద్దీ

సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన వాహనాలతో సోమవారం జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు హైదరాబాద్‌కు పయనమయ్యారు.

Updated : 18 Jan 2022 06:00 IST

విజయవాడ పండిట్‌ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులతో సందడి

సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన వాహనాలతో సోమవారం జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. కంచికచర్ల మండలం కీసర, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్‌ వసూలు కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయత్రం ఐదు గంటల వరకూ 8,000 వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు కీసర టోల్‌ ప్లాజా మేనేజర్‌ జయప్రకాష్‌ తెలిపారు. విజయవాడ బస్టాండు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.

- న్యూస్‌టుడే, కంచికచర్ల

కీసర టోల్‌ వసూలు కేంద్రం వద్ద బారులు తీరిన కార్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని