logo

నిండైన వ్యక్తిత్వం.. నిలువెత్తు తెలుగుదనం

నిండైన వ్యక్తిత్వంతో నిలువెత్తు తెలుగుతనం ఉట్టిపడే మహా పురుషుడు ఎన్టీఆర్‌ అని తెదేపా పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌రాజా అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ జన్మస్థలమైన

Updated : 19 Jan 2022 05:49 IST

నిమ్మకూరు, కొమరవోలు గ్రామాల్లో నందమూరికి ఘన నివాళి

నిమ్మకూరులో స్థానిక నాయకులతో కలిసి ఎన్టీఆర్‌, బసవతారకం కాంస్య విగ్రహాలకు నివాళులర్పిస్తున్న

తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌రాజా

నిమ్మకూరు, కొమరవోలు (గ్రామీణ పామర్రు), న్యూస్‌టుడే: నిండైన వ్యక్తిత్వంతో నిలువెత్తు తెలుగుతనం ఉట్టిపడే మహా పురుషుడు ఎన్టీఆర్‌ అని తెదేపా పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌రాజా అన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ జన్మస్థలమైన నిమ్మకూరు, అత్తవారి గ్రామం కొమరవోలులో ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన గొప్ప నాయకుడు మన అన్న ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనందరం పయనిద్దామని.. ఆయన స్థాపించిన తెదేపాను మరింత బలోపేతం చేద్దామన్నారు. అంతకు ముందు నిమ్మకూరులోని ఎన్టీఆర్‌, బసవతారకంల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కొమరవోలులో ఎన్టీఆర్‌ సన్నిహితుడు, బయోగ్రీన్‌ రెమిడీస్‌ కంపెనీ అధినేత మోటూరి కృష్ణప్రసాద్‌, మాజీ సర్పంచి కాకరాల హరిబాబుతో కలిసి ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా మండల అధ్యక్షుడు కుదురవల్లి ప్రవీణ్‌చంద్ర, నిమ్మకూరు సర్పంచి పడమట శ్రీనివాసరావు, వైస్‌ సర్పంచి నందమూరి ప్రసాద్‌, తెదేపా నాయకులు నందమూరి శివరామకృష్ణ, కుదురవల్లి నాగేశ్వరరావు, జంపాని వెంకటేశ్వరరావు, తాతినేని అశోక్‌, సూరపనేని అంకినీడు, పెద్దినేని చైతన్య, భీమవరపు వెంకట్రావు, ఊసల నాగేంద్ర, అరిగెల రాజేష్‌, వాసా నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని