logo

తరుముకొస్తున్న క్రమబద్ధీకరణ గడువు

విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం)లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. మార్చిలోగా వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాదే గడువు ముగియగా మరోసారి అవకాశం కల్పించడంతో

Updated : 19 Jan 2022 05:51 IST

ఈనాడు, విశాఖపట్నం

విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం)లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. మార్చిలోగా వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాదే గడువు ముగియగా మరోసారి అవకాశం కల్పించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు నెలలే గడువు ఉండగా అప్పటిలోగైనా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది.

మొత్తం ఆరు జోన్లలో ఎక్కువగా విజయనగరం జోన్‌లోని 9 మండలాల్లో అత్యధికంగా అక్రమ లేఅవుట్లను గుర్తించగా ఆ తరువాత పెందుర్తి, అనకాపల్లి, విశాఖలో ఉన్నట్లు గుర్తించారు.

వీఎంఆర్‌డీఏ విస్తరించిన విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులకు ఐదు వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అనుమతికి సిద్ధం చేసినవి కేవలం 1500 మాత్రమేనని సమాచారం. వచ్చిన దరఖాస్తుల ప్రకారం 560 అనధికార లేఅవుట్లను గుర్తించగా వాటిల్లో కొన్నింటికి లేఅవుట్‌ చిత్రాలు పూర్తి చేశారు. మరికొన్నింటికి తయారు చేయాల్సి ఉంది.

● వచ్చి వెళ్తున్నారు: ఎల్‌ఆర్‌ఎస్‌ అయితే బ్యాంకు రుణంతో గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన అయిదారు నెలల్లో అనుమతులు వచ్చేస్తాయనుకున్నారు. రెండేళ్లు దాటినా మంజూరు కాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పదులు సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. మరికొందరు మధ్యవర్తులను సంప్రదించి తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో తెలుసుకుంటున్నారు. అధికారులు మాత్రం గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు.

ఇప్పటికీ పూర్తికాని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన ఏళ్లు గడుస్తున్నా..

* అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020 జనవరిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2019 ఆగస్టు 31కి ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్లాట్లకు ఈ పథకం వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది.

* ● ప్రజల నుంచి 2020 డిసెంబరు 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించగా వాటిని 2021 మార్చిలోగా పరిష్కరించాలని పురపాలకశాఖ మొదట గడువు ఇచ్చింది. ఆ సమయంలో వీఎంఆర్‌డీఏ అధికారులు ఒక్క ఎల్‌ఆర్‌ఎస్‌ కూడా మంజూరు చేయలేకపోయారు. కేవలం దరఖాస్తుల స్వీకరణ, జోన్ల వారీగా వాటిని గుర్తించడం వరకే పరిమితమయ్యారు.

* ● ఆ సమయంలో వీఎంఆర్‌డీఏ-2041 బృహత్తర ప్రణాళిక ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించడం, ప్రణాళిక అమలుపై దృష్టి పెట్టడంతో ఈ పనులు చేయలేకపోయారు. ఈలోగా గడువు ముగియడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 2022 మార్చిలోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించడంతో పలు కారణాల వల్ల నెమ్మదిగా సాగిస్తున్నారు.


క్రమబద్ధీకరణకు గుర్తించినవి ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చిన మొత్తం దరఖాస్తులు

100

5,700


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు