AP News: గుడివాడలో ‘క్యాసినో’ కాక.. తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా

Updated : 21 Jan 2022 16:56 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్‌ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే అంశంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులుగా ఉన్న తెదేపా సీనియర్‌ నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమా, వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గుడివాడ చేరుకున్నారు.

తొలుత తెదేపా కార్యాలయానికి చేరుకున్న నేతలు.. అక్కడి నుంచి క్యాసినో నిర్వహించిన ప్రాంతానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. కన్వెన్షన్‌ సెంటర్‌ పరిశీలనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన తెదేపా నేతలు బొండా ఉమ, ఆలపాటి రాజా, వర్ల రామయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఇదే సమయంలో తెదేపా నేత బొండా ఉమకు చెందిన కారు అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. పోలీసుల సహకారంతోనే వైకాపా కార్యకర్తలు కారు అద్దాలను ధ్వంసం చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని