logo

AP News: చనిపోయిన వారికీవ్యాక్సిన్‌.. మొబైళ్లకు మెసేజ్‌లు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో పాయకరావుపేటలో పలు చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. చనిపోయిన వారికి వ్యాక్సిన్‌ వేసినట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. బృందావనం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి గుర్నాథరావు గతేడాది మే

Updated : 28 Jan 2022 08:44 IST

పాయకరావుపేట, న్యూస్‌టుడే: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో పాయకరావుపేటలో పలు చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. చనిపోయిన వారికి వ్యాక్సిన్‌ వేసినట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. బృందావనం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి గుర్నాథరావు గతేడాది మే 28న మరణించారు. పీహెచ్‌సీలో గురువారం టీకా వేయించుకున్నారని ఆయన కుమారుడు శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. ఈ విషయమై వైద్యాధికారి శిరీషను సంప్రదించగా.. టీకా వేసినట్లు కంప్యూటర్‌లో పొరపాటుగా నమోదు చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందన్నారు.

విస్మయానికి గురిచేసిన ‘సందేశం..

పెదవాల్తేరుకు చెందిన పి.కొండలరావు అనారోగ్యంతో 2020లో మృతిచెందారు. చనిపోయేటప్పటికే ఆయన పదవీ విరమణ చేశారు. అయితే గురువారం కొండలరావు కుటుంబ సభ్యుల చరవాణికి ఓ సంక్షిప్త సమాచారం వచ్చింది. ‘సి.హెచ్‌.కృష్ణారావుకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినందున సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్న మీరు (కొండలరావు) ఐసొలేషన్‌లో ఉండాలని’ ఉంది. చదివిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని