Kodali Nani: ‘ఎవరైనా మంచోడు దొరికితే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి మార్చేస్తారు’

రాష్ట్రంలో భాజపాను తెదేపాకు బీ టీమ్‌గా సోము వీర్రాజు మార్చేశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ఎజెండా తయారుచేస్తే వీర్రాజు దాన్ని అమలు చేస్తారని ఆరోపించారు. ‘సోము వీర్రాజు భాజపాను తెదేపాకు అద్దెకిచ్చారు. ఎవరైనా మంచోడు

Updated : 28 Jan 2022 10:20 IST

విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు సీఎంకు పాదాభివందనం
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో భాజపాను తెదేపాకు బీ టీమ్‌గా సోము వీర్రాజు మార్చేశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ఎజెండా తయారుచేస్తే వీర్రాజు దాన్ని అమలు చేస్తారని ఆరోపించారు. ‘సోము వీర్రాజు భాజపాను తెదేపాకు అద్దెకిచ్చారు. ఎవరైనా మంచోడు దొరికితే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి మార్చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘రైతుల కోసం 11 వేలకు పైగా ఆర్బీకేలను తెచ్చి.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు వ్యవస్థలతో ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ చేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. పాదయాత్ర సమయంలో నిమ్మకూరు ప్రాంతంలో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు జగన్‌ను కలిసి మేం మీకు మద్దతిస్తాం.. ఎన్టీఆర్‌ పేరును జిల్లాకు పెట్టాలని కోరారు. జగన్‌ వారికి మాటిచ్చినట్లుగానే.. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎన్టీఆర్‌ను దైవంగా భావించే వారి తరఫున నేను ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేస్తున్నా’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని