రాష్ట్రంలో సజ్జల, విజయసాయి పాలన

రాష్ట్రం లోపల సజ్జల రామకృష్ణారెడ్డి... వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం చలాయిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. క్యాబినెట్‌ను అటకెక్కించిన జగన్‌ కేవలం అయిదుగురితో కిచెన్‌ క్యాబినెట్‌

Updated : 29 Jan 2022 04:32 IST

యనమల రామకృష్ణుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రం లోపల సజ్జల రామకృష్ణారెడ్డి... వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం చలాయిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. క్యాబినెట్‌ను అటకెక్కించిన జగన్‌ కేవలం అయిదుగురితో కిచెన్‌ క్యాబినెట్‌ నడుపుతున్నారని ఓ ప్రకటనలో మండిపడ్డారు.  ‘‘సీఎం జగన్‌రెడ్డి మంత్రివర్గం తోలుబొమ్మగా మారింది. మొత్తం అధికారాలన్నీ జగన్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పెత్తనమంతా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పెద్దిరెడ్డి చేతుల్లోనే ఉంది. మంత్రులు మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఉత్సవ విగ్రహాల్లా మారారు.రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసినా..  ఒక్క జిల్లాకూ అంబేడ్కర్‌, బీసీ నేత గౌతులచ్చన్న పేరు పెట్టలేదు. ఇది జగన్‌రెడ్డి బీసీ వ్యతిరేక నైజానికి నిదర్శనం. రాష్ట్రంలో ప్రతి దానికి సలహాదారులే స్పందిస్తున్నారు. సజ్జల మాట్లాడుతుంటే ఆయన వెనకాల నామమాత్రంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన నుంచోవడం కన్నా ఘోరం లేదు. రాష్ట్రం నుంచి 20 మంది అధికారులతో బుగ్గన దిల్లీ వెళితే.. పత్రికా సమావేశంలో విజయసాయిరెడ్డే మొత్తం మాట్లాడారు. దీనిపై బుగ్గన క్షోభపడుతున్నారు. పరిపాలనను, అభివృద్ధిని, పెట్టుబడులను, సంక్షేమాన్ని ఇలా... మొత్తాన్ని రివర్స్‌ చేశారు. ఇక రివర్స్‌ చేయాల్సింది జగన్‌రెడ్డినే. ఇది ఎంతో దూరంలో లేదు...’’ అని యనమల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని