శ్రీవారి ఉచిత సర్వదర్శనం ఆన్‌లైన్‌ టికెట్ల జారీ నేడు

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా త్వరలోనే ఆఫ్‌లైన్‌ విధానంలో దర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి శుక్రవారం  తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు శనివారం ఉదయం 9 గంటలకు

Updated : 29 Jan 2022 05:47 IST

తిరుమల, న్యూస్‌టుడే: సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా త్వరలోనే ఆఫ్‌లైన్‌ విధానంలో దర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి శుక్రవారం  తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో జారీ చేస్తామన్నారు. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్‌ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్‌లైన్‌ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా 40 నిమిషాల్లోనే భక్తులు బుక్‌చేసుకున్నారు.

తితిదే ట్రస్టులకు రూ.2 కోట్ల విరాళం
తితిదేకు చెందిన వివిధ ట్రస్టులకు ఇద్దరు దాతలు రూ.2 కోట్లను విరాళంగా అందజేశారని చెన్నై తితిదే స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి తెలిపారు. చెన్నైకి చెందిన ముని శ్రీనివాసులురెడ్డి తితిదే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.కోటి.. మరో అజ్ఞాత భక్తుడు తితిదే శ్రీవేెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని