logo

‘జూ’లోకి కొత్త నేస్తాలు రాక

 ఇందిరాగాంధీ జూపార్కుకు వేరొక జూపార్కు నుంచి కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా గురువారం తెలిపారు. ఇటీవల పంజాబ్‌లో ఛత్బీర్‌ జంతుప్రదర్శన శాల నుంచి కొన్నింటిని తీసుకొచ్చిన సంగతి విదితమే.

Updated : 18 Mar 2022 05:31 IST

గ్రే జంగిల్‌ పౌల్‌

ఎండాడ, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ జూపార్కుకు వేరొక జూపార్కు నుంచి కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా గురువారం తెలిపారు. ఇటీవల పంజాబ్‌లో ఛత్బీర్‌ జంతుప్రదర్శన శాల నుంచి కొన్నింటిని తీసుకొచ్చిన సంగతి విదితమే. తిరుపతి వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి గురువారం సాయంత్రం గ్రే జంగిల్‌ పౌల్‌(మగ-1, ఆడది-2), వైల్డ్‌ డాగ్‌ (మగ-1, ఆడది-1) అడవి దున్న (ఆడది-1), చౌసింగ్‌ (మగ-1, ఆడది-1)లను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక్కడి నుంచి హైనా, అడవిదున్న, నక్కలను తిరుపతి జూకు తరలించామన్నారు. వైల్డ్‌ డాగ్‌, అడవి దున్నల సంతతిని పెంచేందుకు ఇలాంటి కొత్త జాతులను ఇక్కడికి తీసుకువచ్చినట్లు క్యూరేటర్‌ పేర్కొన్నారు. కొత్తగా రప్పించిన వాటిని కొద్ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్లలోకి విడిచి పెడతామన్నారు.

వైల్డ్‌ డాగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని