logo

సాంకేతికత వినియోగంపై అవగాహన

విశాఖలోని ఐఎన్‌ఎస్‌ ఏకశిలలో శుక్రవారం గ్యాస్‌ టర్బైన్స్‌ టెక్నాలజీ నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ అడ్మిరల్‌ సందీప్‌ నైతాని మాట్లాడుతూ...

Updated : 21 May 2022 05:52 IST


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

గాజువాక, న్యూస్‌టుడే : విశాఖలోని ఐఎన్‌ఎస్‌ ఏకశిలలో శుక్రవారం గ్యాస్‌ టర్బైన్స్‌ టెక్నాలజీ నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ అడ్మిరల్‌ సందీప్‌ నైతాని మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను నైతాని ప్రారంభించారు. మొత్తం 12 సంస్థలు పాల్గొని.... కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ, గ్యాస్‌ టర్బైన్ల వినియోగంపై తయారు చేసిన నమూనాలు ప్రదర్శించాయి. వివిధ పారిశ్రామిక సంస్థల పరిశోధనలతో రూపొందించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని