logo

సముద్రంలో దూకి తెదేపా నాయకుడి ఆత్మహత్య

మానసిక సమస్యలతో బాధపడుతున్న భీమిలికి చెందిన తెదేపా నాయకుడు శుక్రవారం తెల్లవారుజామున సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై జి.ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 21 May 2022 05:52 IST


దాసరి వెంకటేష్‌ (పాతచిత్రం)

భీమునిపట్నం, న్యూస్‌టుడే: మానసిక సమస్యలతో బాధపడుతున్న భీమిలికి చెందిన తెదేపా నాయకుడు శుక్రవారం తెల్లవారుజామున సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై జి.ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి రొట్టెలవీధికి చెందిన దాసరి వెంకటేష్‌(57) కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తూ భీమిలి మూడో వార్డు తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కుమార్తె శ్రావణికి ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ వెంకటేష్‌ కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున భీమిలి సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాన్ని కొంతమంది ఉదయపు నడకదారులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానసిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని మృతుడి కుమారుడు గోపీనాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని