మట్టిలో మాణిక్యాలకు వెలుగు

క్రీడా పాఠశాలలోని విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు వీలుగా శారీరక దారుఢ్యం పొందేందుకు వీలుగా పోషకాలున్న ఆహారాన్ని ప్రతిరోజూ అందిస్తున్నారు. కనీసం 4000 క్యాలరీల విలువైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. చిన్ననాటి నుంచే గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభని గుర్తించి.. ప్రోత్సహించేందుకు అరకులోయ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల కృషి చేస్తోంది. అత్యున్నత శిక్షణ అందించి.. క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేందుకు బాటలేస్తోంది. రాష్ట్రంలోని ఏకైక గిరిజన క్రీడా

Updated : 28 May 2022 05:44 IST

పోషకాలతో కూడిన ఆహారం
గిరి బాలలకు వరం ‘క్రీడా పాఠశాల’

క్రీడా పాఠశాలలోని విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు వీలుగా శారీరక దారుఢ్యం పొందేందుకు వీలుగా పోషకాలున్న ఆహారాన్ని ప్రతిరోజూ అందిస్తున్నారు. కనీసం 4000 క్యాలరీల విలువైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. చిన్ననాటి నుంచే గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభని గుర్తించి.. ప్రోత్సహించేందుకు అరకులోయ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల కృషి చేస్తోంది. అత్యున్నత శిక్షణ అందించి.. క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేందుకు బాటలేస్తోంది. రాష్ట్రంలోని ఏకైక గిరిజన క్రీడా పాఠశాల కావడం విశేషం.

అరకు క్రీడా పాఠశాలలో ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించారు.

అరకులోయలోని యువ శిక్షణకేంద్రంలో 2016లో ప్రారంభించిన క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్‌, విలువిద్య, బ్యాడ్మింటన్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ తదితర విభాగాల్లో ప్రత్యేక కోచ్‌లతో శిక్షణని అందిస్తున్నారు. క్రీడా పాఠశాలలోని విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించారు. ఇప్పటి వరకు వివిధ క్రీడల్లో 260 వరకు పతకాలను ఇక్కడి వారు సొంతం చేసుకున్నారు. పాఠశాలలో క్రీడలతో పాటు విద్యని అందిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు గతేడాది పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతని సాధించారు.

క్రీడా పాఠశాల విద్యార్థులు పలువురు ఈ ఏడాది సాయ్‌ ఆధ్వర్యంలో అందించే శిక్షణకి ఎంపికయ్యారు. ఏలూరులోని సాయ్‌ శిక్షణ కేంద్రంలో అత్యున్నత కోచ్‌ల పర్యవేక్షణలో ఆధునిక స్థాయి పరిజ్ఞానం, సౌకర్యాలతో విద్యార్థులు శిక్షణని పొందుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా శిక్షణని అందిస్తోంది.


క్రీడా పాఠశాల శిక్షణ ఓ వరం..
- నందకిశోర్‌, లాంగ్‌జంప్‌ క్రీడాకారుడు

క్రీడా పాఠశాలలో చేరకముందు అథ్లెటిక్స్‌లో ఆసక్తి ఉండేది. పాఠశాలలో చేరిన అనంతరం సుశిక్షితులైన కోచ్‌ల పర్యవేక్షణలో లాంగ్‌జంప్‌లో నైపుణ్యం సాధించాను. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. ఈ శిక్షణ నన్ను మానసికంగా, శారీరకంగా బలంగా చేసింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొనే అవకాశం రావాలని శిక్షణని పొందుతున్నాను.


ఉదయాన్నే రాగి అంబలితో ప్రారంభమయ్యే ఆహారం రాత్రి మాంసాహారం, ఖర్జూరంతో ముగుస్తుంది. అల్పాహారంతో పాటు రోజూ రెండు గుడ్లు, అరటిపండు, పాలని అందిస్తున్నారు. మధ్యాహ్నం రెండు కూరలు, అరటిపండు, పెరుగు, అప్పడం, స్వీట్‌ పెడుతున్నారు. సాయంత్రం బిస్కట్‌లు, రాత్రి భోజనంగా అన్నంతో పాటు మాంసాహారాన్ని అందిస్తున్నారు.


 


కోచ్‌ల సహకారంతో ప్రతిభ : కోచ్‌లు అందించిన శిక్షణతోపాటు
- శరత్‌కుమార్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు

పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నాను. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ర్యాంకింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచాను. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో పతకాలు సాధించాలన్నదే నా కోరిక. క్రీడా పాఠశాల నిర్వాహకులు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని ముందడుగు వేస్తాను.


ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు
- పీఎస్‌ఎన్‌ మూర్తి, ప్రిన్సిపల్‌, క్రీడా పాఠశాల

గిరి విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటున్నారు. క్రీడల్లో ప్రతిభ చూపించి విద్యార్థులు ప్రభుత్వ కొలువులు పొందే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఐటీడీఏ అధికారులతో పాటు గురుకుల ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని