logo

జగన్‌ పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌

రైతులను నిలువునా మోసగించిన జగన్‌ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో

Updated : 12 Jun 2022 05:32 IST

మాట్లాడుతున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, పక్కన శ్రీధర్‌చౌదరి

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: రైతులను నిలువునా మోసగించిన జగన్‌ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.936 కోట్లు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నమ్మబలి ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా నయవంచన చేశారని విమర్శించారు. మూడేళ్లుగా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదన్నారు. రైతులకు రూ.4,500 కోట్లు హక్కుగా రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా శ్రీసత్యసాయి జిల్లాలో ఎలా అడుగు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీమా కంపెనీ ఇచ్చే సొమ్ము 3.30 లక్షల మంది అన్నదాతలకు పంచడానికి రావడం సిగ్గుచేటన్నారు. అన్నదాత కన్నెర్రజేస్తే ఏ ప్రభుత్వం నిలబడదని వైకాపా గుర్తెరగాలని తెదేపా ప్రధానకార్యదర్శి శ్రీధర్‌చౌదరి హెచ్చరించారు.
13న కలెక్టరేట్‌ వద్ద నిరసన
ఉమ్మడి జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 13న అనంతపురం కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారథి తెలిపారు. డ్రిప్‌ పరికరాలు, పంట నష్టపరిహారం ఇవ్వకపోవడం, మూడేళ్లుగా రైతులకు జరుగుతున్న అన్యాయంపై అన్నదాతలతో శాంతియుత ప్రదర్శన చేస్తామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని