logo

కేంద్ర నిధులతోనే ఇళ్ల నిర్మాణం: సీఎం రమేష్‌

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల

Updated : 20 Jun 2022 05:20 IST

మాట్లాడుతున్న సీఎం రమేష్‌

ఆత్మకూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక త్రికుటేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల కష్టాలు పెరిగిపోయాయన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. మద్యం షాపుల్లో పేటీఎం వ్యవస్థ లేదంటూ అకమ్రాల కోసం డిజిటల్‌ చెల్లింపులు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడంలేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్కొన్నారు. భాజపా నాయకులు టీజీ వెంకటేష్‌, సురేంద్రరెడ్డి, సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు మాట్లాడారు. ప్రచారం సందర్భంగా భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ ఆత్మకూరుకు ఏమీ చేయలేకపోయాననే మనోవేదన అప్పట్లో దివంగత గౌతమ్‌రెడ్డికి ఉండేదన్నారు. ఆత్మకూరుకు వచ్చిన సెంచరీ ఫ్లైవుడ్‌ పరిశ్రమ బద్వేలుకు తరలించుకుపోవడంతో ఆయన వేదన పడినట్లు పేర్కొన్నారు. ఆత్మకూరును అభివృద్ధి పథంలో నడపగల భాజపాకు ఓటేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని