logo

‘నన్ను పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారు’

చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. మంగళవారం

Updated : 22 Jun 2022 06:47 IST

సింహాచలం, న్యూస్‌టుడే: చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. మంగళవారం దేవస్థానం పాలకమండలి సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవస్థానానికి, ప్రభుత్వానికి వేర్వేరు అభిప్రాయాలుంటాయని, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను ధర్మకర్తల మండలి తీసుకోలేదన్నారు. గత దేవాదాయశాఖ మంత్రి తనను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తానని బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పంచగ్రామాల్లో ఇళ్ల మరమ్మతుల తీర్మానానికి సంబంధించి రిస్క్‌ తీసుకోలేనని స్పష్టం చేశారు. సభ్యుల ప్రతిపాదనను పంపితే న్యాయపరమైన సలహాలు తీసుకుని చట్టబద్ధంగా ఉంటే ఆమోదించడానికి అభ్యంతరం లేదన్నారు. ట్రస్టుబోర్డు సభ్యులను పంచగ్రామాలపై తీర్మానం చేయాలని చెబుతూనే.. మరోవైపు తనను తొలగించాలని మంత్రిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పంచగ్రామాల సమస్య విషయంలో పాలకవర్గం చట్టాన్ని అధిగమించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని