logo

పల్నాడులో లోకేశ్‌ పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు

పల్నాడులో లోకేశ్‌ చేసిన పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు పుడుతుందని తెదేపా సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

Updated : 25 Jun 2022 06:11 IST

చంద్రబాబుతో యరపతినేని భేటీ

చంద్రబాబుతో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు, పక్కన అచ్చెన్నాయుడు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: పల్నాడులో లోకేశ్‌ చేసిన పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు పుడుతుందని తెదేపా సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును కలసి పల్నాడులో పరిస్థితులు, లోకేశ్‌ పర్యటనకు ప్రజల్లో నుంచి అనూహ్య స్పందన, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పల్లె పిలుస్తోంది, పల్లెనిద్ర కార్యక్రమాలపై మాట్లాడారు. ‘జల్లయ్య హత్య పట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది. కర్మకాండలకు, పెద్దకర్మకు లోకేశ్‌ హాజరై రూ.25 లక్షలకు ఆర్థిక సహాయం చేయడం కార్యకర్తల్లో, జల్లయ్య కుటుంబంలో మనోధైర్యం నింపింది. లోకేశ్‌ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం భావించినా గురజాల, మాచర్లలో కార్యకర్తలు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి నీరాజనం పట్టారు. గతంలో ఎన్టీఆర్‌, మీరు పల్నాడు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు ఏవిధంగా స్వచ్ఛందంగా తరలివచ్చారో లోకేశ్‌ పర్యటనలకు ఆవిధంగా వచ్చారు. గురజాలలో అధికార పార్టీ నేతల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తలతో పాటు నేను కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నా’...అని చంద్రబాబు దృష్టికి యరపతినేని తీసుకువెళ్లారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ‘కార్యక్రమాన్ని అంతా నేను గమనించాను. ముఖ్యంగా పిడుగురాళ్లలో బాగా చేశారు. ప్రతిఒక్కరూ మీ వలే పని చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. అండగా ఉండాలి. పల్లె పిలుస్తోంది, పల్లె నిద్ర కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. ఇదే పంథాను ఎన్నికల వరకు కొనసాగించాలి. మీరు కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా’..అని యరపతినేనిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని