Andhra news: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చినవీరభద్రుడికి జైలు శిక్ష

విశ్రాంత ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడికి హైకోర్టు 4 వారాల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. గతంలో  చినవీరభద్రుడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు

Updated : 03 May 2022 22:41 IST

అమరావతి: విశ్రాంత ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడికి హైకోర్టు 4 వారాల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. అయితే న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును న్యాయస్థానం రెండు వారాలు నిలుపుదల చేసింది. న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు పిటిషనర్లు సకాలంలో బీపీఈడీ కోర్సును అభ్యసించడానికి అనుమతించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. గతేడాది మార్చి 8న సెండరీగ్రేడ్‌ టీచర్లు బీపీఈడీ కోర్సును అభ్యసించేందుకు అనుమతించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఎస్జీటీలు హైకోర్టులో ధిక్కరణ వ్యా్జ్యం దాఖలు చేశారు. కోర్టు తీర్పు అమల్లో ఆలస్యం జరిగినందుకు అధికారి క్షమాపణ చెప్పినా ధర్మాసనం అంగీకరించలేదు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పదోన్నతి కోసం డిగ్రీ అభ్యసనకు అవరోధంగా ఉన్న  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని