Updated : 02 Jun 2021 11:43 IST

AP News: పీలేరు జైలుకు జ‌డ్జి రామ‌కృష్ణ త‌ర‌లింపు

చిత్తూరు: జ‌డ్జి రామ‌కృష్ణ‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి ఈ ఉదయం పీలేరు స‌బ్‌ జైలుకు త‌ర‌లించారు. త‌న తండ్రికి ప్రాణ‌హాని ఉందంటూ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎ.కె. గోస్వామికి రామ‌కృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. రామ‌కృష్ణ ఉన్న బ్యార‌క్‌కు వ‌చ్చిన మ‌రో ఖైదీ ఆయ‌న‌ను బెదిరించార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. బెదిరించిన వ్య‌క్తి వ‌ద్ద క‌త్తి కూడా దొరికింద‌ని అందులో వివ‌రించారు. ఈ లేఖ‌పై స్పందించిన హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌.. రామ‌కృష్ణ‌కు ప్రాణ హాని విష‌య‌మై ప్ర‌భుత్వ న్యాయ‌వాదిని ప్రశ్నించారు.  రామ‌కృష్ణ‌ను మ‌రో బ్యార‌క్‌లోకి మార్చామ‌ని చెప్ప‌గా.. పూర్తి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది. ఇంతలోనే జడ్జి రామ‌కృష్ణ‌ను పీలేరు స‌బ్‌జైలుకి త‌ర‌లించారు. 

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు ఏప్రిల్ నెల‌లో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య దీనిపై ఫిర్యాదు చేయగా.. సస్పెండయిన జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. 


Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని