Andhra News: అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగదు: మంత్రి జోగి రమేష్

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండేలా...

Published : 17 May 2022 18:07 IST

అమరావతి: నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండేలా ప్రణాళిక కొనసాగుతోందని చెప్పారు. మొదటి విడతలో 15 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని వెల్లడించారు. ప్రత్యేక దృష్టి సారించి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లే అవుట్లలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రజా ప్రతినిధులు అందరినీ భాగస్వాములను చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం కాల్ సెంటర్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులకు రుణ సౌకర్యంతో  పాటు మెటీరియల్ అందచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని.. అర్హులైన లబ్ధిదారులకు ఎక్కడా అన్యాయం జరగదని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని