Andhra News: అయ్యన్నపాత్రుడి ఇంటికి నల్లజర్ల పోలీసులు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు వచ్చారు..

Updated : 23 Feb 2022 13:34 IST

నర్సీపట్నం: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు వచ్చారు.. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్‌ను అయ్యన్న అసభ్య పదజాలంతో దూషించారంటూ వైకాపా నేత రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన నల్లజర్ల పోలీసులు అయ్యన్నపై 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో బుధవారం నర్సీపట్నంలోని ఆయన నివాసానికి సీఐ రఘు, ఎస్సైలు శ్రీహరిరావు, అవినాష్‌ వచ్చారు. అయ్యన్న ఇంట్లో లేరని తెదేపా నేతలు చెబుతుండగా.. ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పోలీసుల బృందం అంటోంది. అయ్యన్నపాత్రుడికి నోటీసు ఇచ్చి వెళ్లేందుకు ఆయన ఇంటి వద్దే పోలీసులు వేచిచూశారు. కొంతసేపటి తర్వాత నోటీసును ఇంటికి అతికించి వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని