Nara Lokesh: నారా లోకేశ్‌కు కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్‌ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ట్విటర్ ద్వారా లోకేశ్‌ వెల్లడించారు. తనకు స్వల్ప  లక్షణాలు...

Updated : 17 Jan 2022 14:49 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్‌ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ట్విటర్ ద్వారా లోకేశ్‌ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారు తొందరగా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ క్షేమంగా ఉండాలని లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని