AP News : ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published : 30 Jul 2021 11:17 IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు అందాయి.

రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 78,784 నమూనాలు పరీక్షించగా 2,107 మంది కరోనా బారినపడ్డారు. కరోనా కారణంగా మరో 20 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని