AP news : ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయానికి పవర్‌ కట్‌

ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయానికి విద్యు్‌త్‌శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. రూ.10 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతోనే విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించినట్లు వెల్లడించారు. గత మూడేళ్లుగా ఏలూరు...

Updated : 28 Jan 2022 15:19 IST

ఏలూరు : ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయానికి విద్యు్‌త్‌శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. రూ.10 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతోనే విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి కంప్యూటర్లు, ఇతర పనులను జనరేటర్‌ నడుపుతున్నారు. గత మూడేళ్లుగా ఏలూరు కార్పొరేషన్‌ విద్యుత్‌ బకాయిలు చెల్లించడం లేదు.   మరోవైపు కార్పొరేషన్‌ పరిధిలో తాగునీటి పథకాలు, వీధి దీపాలకు సంబంధించిన బకాయిలు కూడా రూ.వేల కోట్లకు పెరిగిపోయినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలోనే కార్పొరేషన్‌ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని, ఎవరూ స్పందించకపోవడం వల్లే విద్యుత్‌ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని