AP PRC: జీతాలు తగ్గించి చర్చల పేరిట మాపై నెపం నెట్టొద్దు: బొప్పరాజు

అనేకసార్లు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వినిపించుకోనందునే సమ్మె బాట పట్టామని పీఆర్సీ సాధన

Published : 28 Jan 2022 13:32 IST

గుంటూరు: అనేకసార్లు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వినిపించుకోనందునే సమ్మె బాట పట్టామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. చర్చలకు పిలుస్తున్నా ఉద్యోగులు ముందుకు రావడం లేదంటూ ప్రభుత్వం పేర్కొనడం సరికాదని చెప్పారు. గుంటూరులో ఉద్యోగుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ జీతాలు తగ్గించి చర్చల పేరిట తమపై నెపం నెట్టొద్దన్నారు. కొత్త జీవోలను రద్దు చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని.. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని