Polavaram Project: డయాఫ్రమ్‌ వాల్‌ కొత్తది నిర్మించాలా?: పోలవరంపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు

Updated : 22 May 2022 12:46 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దే జరుగుతున్న ఈ సమీక్ష సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సహా మరికొందరు అధికారులు హాజరయ్యారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖ పలు దఫాలుగా సమీక్ష నిర్వహించింది.

రెండు చోట్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ పునర్నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు దిల్లీ ఐఐటీ నిపుణులు ఇచ్చిన సలహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పోలవరంలో మిగిలిన సమస్యలపైనా సమీక్షిస్తున్నారు. స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌ పనులు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణంపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం దెబ్బతిన్న ప్రాంతంలోనే డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా? లేక కొత్తది నిర్మించాలా? అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని