Updated : 03/10/2021 18:47 IST

TS news: శబరిమల యాత్రపై అపోహలు వద్దు: వాసు నాయర్‌

హైదరాబాద్‌: శబరిమల యాత్రపై అపోహలు వీడి పెద్దెత్తున అయ్యప్ప భక్తులు తరలి రావాలని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్‌.వాసు నాయర్‌ కోరారు. దేశంలో అధికశాతం ప్రజలు కొవిడ్‌ టీకాలు తీసుకున్న నేపథ్యంలో ... తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవాలన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫ్యాప్సి ఆడిటోరియంలో శబరిమల దేవస్థానం బోర్డు, భాగ్యనగర్‌ అయ్యప్ప సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శబరిమల యాత్రపై నెలకొన్న అపోహలు, సందేహాలపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల గురు స్వాములు, అయ్యప్ప సేవాసమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు నాయర్‌  మాట్లాడుతూ...దేశం నలుమూలల నుంచి శబరికి ఏటా రెండు కోట్ల మంది అయ్యప్ప స్వాములు వస్తుంటారని తెలిపారు. దేశాన్ని పట్టి పీడించిన కరోనా  మహమ్మారి వల్ల బోర్డు నిబంధనల మేరకు కొన్ని ఆంక్షలు విధించామని తెలిపారు. దీంతో అయ్యప్ప స్వాములు సగానికి తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప గురు స్వాములు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని త్వరలో జరిగే బోర్డు సమావేశంలో చర్చించి స్వాములకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది స్వామి దర్శనానికి ఎన్ని లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని