AP News: కొత్త పే స్కేళ్లతోనే జీతాలు.. మరోసారి సర్కారు ఉత్తర్వులు

ఇటీవల విడుదల చేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ 

Updated : 23 Jan 2022 10:51 IST

అమరావతి: ఇటీవల విడుదల చేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణతో ముందుకెళుతుండగా.. ఏపీ ప్రభుత్వం కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌, ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను సర్కారు ఆదేశించింది. ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌ను అనుసరించి బిల్లుల చెల్లించాలని స్పష్టం చేసింది.

2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్‌ 31వరకు సర్వీస్‌ గణించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఎల్లుండిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. డీడీవోలకు కొత్త పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని