Andhra News: ఏపీలో అద్భుతాలు జరిగాయని మంత్రులు జోకులేస్తున్నారు: సోమిరెడ్డి

అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు జరిగాయని ఏపీ మంత్రులు జోకులేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

Updated : 01 May 2022 05:42 IST

అమరావతి: అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు జరిగాయని ఏపీ మంత్రులు జోకులేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఏం సాధించారో అర్థం కావడం లేదని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. వ్యవసాయ రంగం కుదేలైపోయింది, ఇరిగేషన్ మూలనపడింది, రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కు లేదు.. ఇదేనా వైకాపా చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలతో ఎలాంటి ఉపయోగం లేదని.. అవి రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. 2020-21 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.20వేల కోట్లు కేటాయించారని.. ఖర్చు పెట్టింది కేవలం రూ.7 వేల కోట్లే అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కే విలువ ఇవ్వని వైకాపాకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని