Andhra News: కోనసీమలో ఎస్పీ వాహనంపై ఆందోళనకారుల రాళ్ల దాడి

కోనసీమ జిల్లాలో ఎస్పీ వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడి జరిగిన వెంటనే అప్రమత్తమై పోలీసులు వెంబడించడంతో ఆందోళనకారులు పారిపోయారు....

Updated : 25 May 2022 19:24 IST

రావులపాలెం: కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడి జరిగిన వెంటనే అప్రమత్తమై పోలీసులు వెంబడించడంతో ఆందోళనకారులు పారిపోయారు.

కోనసీమ సాధన సమితి ఇవాళ చలో రావులపాలెంకు పిలుపునిచ్చింది. చలో రావులపాలెం అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వారు నిర్ణయించారు. అమలాపురం సంఘటనను దృష్టిలో పెట్టుకొని ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడివారిని అక్కడే నియంత్రించారు. ఎవరు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఆంక్షలు విధించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు పట్టణంలో బందోబస్తు చేపట్టారు. కోనసీమ సాధన సమితి సభ్యులు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లేందకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని నిలువరించారు. బందోబస్తులో భాగంగా పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎస్పీ కారులో వెళ్తుండగా రావులపాలెం రింగ్‌ సెంటర్‌ వద్ద కొంత మంది యువకులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైప పోలీసులు యువకులను వెంబడించడంతో వారు పారిపోయారు. ఈ ఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తం అయ్యారు. కొన్ని చోట్ల యువకులు దాగి ఉండొచ్చని.. ఆందోళనకు దిగొచ్చని భావించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం రావులపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని