Chintamaneni: నన్ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు యత్నించారు: చింతమనేని

తనపై అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు.

Updated : 26 May 2022 18:53 IST

ఏలూరు: తనపై అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నలుగురు ఐపీఎస్‌ అధికారులు, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలపై ఏలూరు కోర్టులో ఆయన ప్రైవేట్ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆగస్ట్‌లో విశాఖ గ్రామీణ జిల్లాలో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసేందుకు యత్నించారని.. దీనిపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ప్రతిసారీ తనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని చెప్పారు. గడిచిన రెండేల్లలో తనపై 25కు పైగా పోలీసు కేసులు పెట్టారని చింతమనేని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని