ఉద్యోగుల పట్ల దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి: యనమల

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండున్నరేళ్ల జగన్‌ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు

Published : 19 Jan 2022 15:07 IST

అమరావతి: ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండున్నరేళ్ల జగన్‌ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వడం చరిత్రలో జరగలేదని వెల్లడించారు. అసుతోష్‌ మిశ్రా కమిటీ సిఫార్సులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న జీవోలను వెంటనే రద్దు చేయాలని యనమల డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని