అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే.. జిల్లాకో విమానాశ్రయమా?: అయ్యన్న పాత్రుడు

రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.

Updated : 22 Jan 2022 14:34 IST

విశాఖ: రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల పాల్జేశారని.. ఉద్యోగులు, పింఛనుదారులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే జిల్లాకో విమానాశ్రయం ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు.

గతేడాది శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలలు ఏమయ్యాయని నిలదీశారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలాన్ని నేటి వరకూ కేటాయింకపోవడం అన్యాయమన్నారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్నింటి కంటే ముందు కృషి చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని