TDP: చంద్రబాబు సారథ్యంలో నెంబర్‌వన్‌గా ఏపీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్‌వన్‌గా దూసుకెళ్లనుందని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కమిటీ మాజీ చైర్మన్‌  ఎల్.వి.ఎస్.ఆర్. కె. ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 07 Jul 2024 20:11 IST

హైదరాబాద్‌ :  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్‌వన్‌గా దూసుకెళ్లనుందని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కమిటీ మాజీ చైర్మన్‌  ఎల్.వి.ఎస్.ఆర్. కె. ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి  పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రిని ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కూటమి విజయంలో నారా భువనేశ్వరి కృషి

ఇటీవలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి అఖండ విజయం వెనక తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి గారి సతీమణి నారా భువనేశ్వరి కృషి ఎంతో ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కమిటీ మాజీ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్  పేర్కొన్నారు. కూటమి విజయం సందర్భంగా నారా భువనేశ్వరితో ప్రసాద్‌ సమావేశమై పార్టీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనేశ్వరి సారథ్యంలో చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపించిందన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తూ.. వేలాది కుటుంబాల్లో ఆమె వెలుగులు నింపుతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని