AP News: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ

Updated : 09 Dec 2021 15:18 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్‌ 59ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. జీవో 59పై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ విషయంలో డ్రెస్‌కోడ్‌ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మహిళా పోలీస్‌ సేవలను ఏవిధంగా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మరో వారం పాటు వాయిదా వేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని