Railway Zone: రైల్వే జోన్‌ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలి: ఎంపీలు

రైల్వేజోన్‌ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో...

Updated : 30 Sep 2021 18:22 IST

విజయవాడ: రైల్వేజోన్‌ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమైన రాష్ట్ర ఎంపీలు .. రైల్వే పరంగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు ఇచ్చారు. రాష్ట్రం నుంచి నిధులు రాలేదని, అందుకే పనులు ఆపేశామని దక్షిణ మధ్యరైల్వే జీఎం గజానన్‌ మాల్యా చెప్పారు. అయితే, పనులు ఆపొద్దని, పూర్తిగా రైల్వే నిధులతోనే చేపట్టాలని ఎంపీలు కోరారు. కొవ్వూరు-భద్రాచలం, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీలు భరత్‌, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ... లోపాయికారీ పోరాటం కాకుండా రాజీలేని పోరాటం చేస్తేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని